ఓబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

ఓబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

జయపురం: వెనుకడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కొరాపుట్‌ జిల్లా వెనుకబడిన తరగతుల ఫోరం (ఓబీసీ) డిమాండ్‌ చేసింది. స్థానిక యాదవ భవనంలో సోమవారం నిర్వహించిన ఓబీసీ ఫోరం సమావేశంలో వివిధ వెనుకబడిన తరగతుల కులాల ప్రతినిధులు పాల్గొన్నారు. కొరాపుట్‌ జిల్లా యాదవ మహాసభ కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ గౌడ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రముఖ న్యాయవాది, జిల్లా యాదవ మహాసభ అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ నాయక్‌ మాట్లాడుతూ.. 2024 జనవరి 1 నుంచి ఒడిశాలో వెనుకబడిన తరగతులు కమిషన్‌ పదవీ కాలం ముగిసిందని అందువలన రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న వెనుకబడిన తరగతుల ప్రజలు తమ రాజ్యాంగపరమైన హక్కును నిరూపించుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పరమైన హక్కులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఎర్పాటు చేయాలని కొరాపుట్‌ జిల్లా ఓబీసీ ఫోరం తరఫున డిమాండ్‌ చేశారు. జిల్లా యాదవ మహాసభ ప్రతినిధి రాజేంఽద్ర కుమార్‌గౌడ, బారిక్‌ సమాజ్‌ ప్రతినిధి తులసీ బెహ రా, జిల్లా బొడేయి సమాజ ప్రతినిధి సాహేబ్‌ మహరాణ, జయపురం కాపు సమాజ్‌ ప్రతినిధి వై.ప్రసా ద్‌, తదితరులు ఓబీసీ కమిషన్‌ లేకపోవటం వలన కలుగుతున్న సమస్యలను వివరించారు. ఈ సమా వేశంలో నరేష్‌ మహాకుడ్‌, రబినారాయణ గౌడ, దండాసి గౌడ, నారాయణ గౌడ, భాస్కర్‌ గౌడ, సుదర్శన గౌడ, కవిరాజ్‌ పరమేశ్వర పాత్రో, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement