ఉపాధి హామీ పథకం పనికి వెళ్లనివ్వకుండా రోడ్డు పనులకు వస్తే రూ.600 ఇస్తామని మా గ్రామానికి చెందిన సవధల సుధ ఆశ చూపడంతో అక్కడికి వెళ్లాను. నా అకౌంట్‌లో డబ్బులు పడ్డాక రూ.500 తీసుకుంది.
– కొండపల్లి పెంటమ్మ, మోపసుబందరు
మూడు రోజులు క్రితం నా అకౌంట్‌లో రూ.600 పడ్డా యి. మా గ్రామానికి చెంది న సుధ వచ్చి దౌర్జన్యంగా డబ్బులు లాగేసుకుంది. ఇదేంటని ప్రశ్నిస్తే రూ.100 మాత్రమే చేతిలో పెట్టింది. – ఎం.గంగమ్మ, మోపసుబందరు
రోడ్డు పనుల్లో ఫొటో దిగకపోతే ఉపాధి పనుల్లో మస్తర్లలో పేరు తొలగిస్తానని బెదిరించింది. మేము చెప్పినట్లుగానే ఉపాధి పనులు జరుగుతాయని, తమను ఎవరూ అడిగేవారు లేరని చెప్పింది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
– కె.శిమ్మన్న,
మోపసుబందరు


