జయపురం: పట్టణాన్ని పాలిథిన్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పట్టణంలోని పలు దుకాణాలపై మున్సిపల్ సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి పూజరౌత్, రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు విభాగాలు సంయుక్తంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా దాదాపు 2 క్వింటాళ్లకు పైగా పాలిథిన్ కవర్లు సీజ్ చేసి, జరిమానా విధించినట్లు వెల్లడించారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో మున్సిపల్ సిబ్బంది సత్యనారాయణ పాత్రో, భవానీ హల్వ, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


