● ఇద్దరు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోలీసులు ఐదు క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి మల్కన్‌గిరి నుంచి సుకుమ వెళ్లే మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వేగంగా వస్తున్న ట్రక్ తారసపడింది. దాన్ని ఆపి అందులో ఉన్నవారిని ప్రశ్నించగా తడబడుతూ సమాధానం చెప్పారు. దీంతో అనుమానంతో వాహనాన్ని పరిశీలించగా గుట్టలుగా ఉన్న గంజాయితో ఉన్న బస్తాలు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని ఐఐసీ రీగాన్‌కీండో సమక్షంలో పోలీసుస్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం నిందితులను విచారింగా గంజాయిని ఛత్తీస్‌గఢ్‌కు కు తరలిస్తున్నట్టు అంగీకరించారు. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలించాలని భావించినట్టు నిందితులు అంగీకరించారు. పట్టుబడిన నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోనాపూర్ గ్రామానికి చెందిన కమల్‌హసన్, విమల్ కుమార్‌గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అలాగే పరారీలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రోహిత్ ప్రజాపతి, మల్కన్‌గిరికి చెందిన దీపంకార్ హల్ద్‌ర్, సౌరబ్ మల్లిక్, జగన్నాథ్ బిశ్వాస్లపై కూడా కేసు నమోదు చేశామన్నారు. పట్టుబడిన గంజాయిని తూకం వేయగా ఐదు క్వింటాళ్లు ఉందని.. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు 50 లక్షలు వుంటుందని ఐఐసీ రీగాన్ కీండో తెలిపారు.


