రాయగడ: జిల్లాలోని గుణుపూర్, కళ్యాణసింగుపూర్ సమితుల పరిధుల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రగాయాలకు గురయ్యారు. గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్యగుడ గ్రామ ప్రధాన రహదారిపై బైకు, స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుణుపూర్ పాత పోస్టాఫీసు వీధికి చెందిన బైక్‌మెకానిక్ చింతాడ రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. గుణుపూర్ శివానంద డెప్పొవీధికి చెందిన పంచానన్ హోతా తన భార్యతో కలిసి పులుగుమి సమీపంలొ వనదుర్గ ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఎరుదుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలొ పంచనన్‌హొత ఆయన భార్యతో పాటు మరొ మరో వ్యక్తి చిన్నా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను గుణుపూర్ ఆస్పత్రికి తరలించగా, రమేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్రగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ప్రమాదానికి గురైన రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
బస్సు –బైకు డీ: మరో యువకుడి మృతి
మరో ఘటనలో కళ్యాణసింగుపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–45 పై బెలకణ సమీపంలో బస్సు, బైకు ఢీకొన్న ఘటనలో పెదిరు ఎలుజ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గడ్దిశెశికల్ ప్రాంతం నుంచి తన భార్యను తీసుకురావడానికి సికరపాయికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


