టేకు దుంగల అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

టేకు దుంగల అక్రమ రవాణా

Jul 15 2026 12:23 AM | Updated on Jul 15 2026 12:23 AM

ముగ్గురు అరెస్టు

పర్లాకిమిడి: దిగపోహాండి (గంజాం జిల్లా) నుంచి అక్రమంగా గజపతి జిల్లాకు ట్రాక్టర్‌పై తరలిస్తున్న టేకు దుంగలను సోమవారం రాత్రి మహేంద్రగిరి అటవీ డివిజన్‌ అధికారి మోజేష్‌ శోబోరో కాపుకాసి గజపతి జిల్లా శియ్యాలిలోట్టి గ్రామ పంచాయతీ హరిదబద జంక్షన్‌ బీట్‌ పోయిపాణి వద్ద పట్టుకుని సీజ్‌ చేశారు. మహేంద్రగిరి రేంజ్‌ అధికారులకు నైట్‌ పెట్రోలింగ్‌ చేస్తుండగా అక్రమంగా మోహనా నుంచి టేకు దుంగలు రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు కాపుకాసి పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్‌లో 7 కలప దుంగలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని అంచనా. స్మగ్లర్లు ట్రాక్టరులో టేకును లోడు చేసి బైకుపై మరో ఇద్దరు ఫాలో అవుతున్నారు. మొత్తం ముగ్గురు ట్రాక్టరుతో సహా పట్టుబడ్డారు. వారిని అటవీ చట్టప్రకారం మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement