న్యూస్‌రీల్
తొలినిజరూప దర్శనం జగన్నాథుడి తొలి నిజరూప దర్శనం జరిగింది. భారీగా భక్తులు వచ్చారు. –8లోu
5 క్వింటాళ్ల గంజాయి.. 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. –8లోu
శ్రీమందిరం ఆదాయం లెక్కింపు
భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుక రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం మంగళవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,352లు వచ్చాయని అధికారులు తెలిపారు.
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026
విభిన్న వన్నెల వస్త్రాల
మేళవింపుతో అందంగా
3 రథాలు
భువనేశ్వర్:
పూరీ శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్రలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా పాలుపంచుకుని స్వామి యాత్రని దిగ్విజయం చేయడంలో పాత్రధారులుగా నిలుస్తారు. ఈ క్రమంలో దర్జీల సేవలు అనన్యంగా నిలుస్తాయి. పవిత్ర దేవతలు యాత్ర చేసే రథాలకు దర్జీ సేవలు చిరునామాగా ఆకట్టుకుంటాయి. ఒక్కో రథానికి విభిన్న వర్ణాల వస్త్రాల మేళవింపుతో ఆకర్షణీయంగా కుట్టి రథాలకు క్రమ పద్ధతిలో చుట్టడంతో మూల విరాటుల రథాల పరిచయం సుస్పష్టం అవుతుంది. దర్జీ మూడు రథాలకు అవసరమైన వస్త్రాలు సిద్ధం చేసే పనులు పూర్తి చేయడంతో రథం వస్త్రాలంకరణ చకచకా తుది మెరుగులు దిద్దుకుంటుంది. తొలి దశలో 3 రథాల ద్వారబంధాల అలంకరణకు అవసరమైన చంద్ర శాలి వస్త్రాల్ని కొఠొ సుంవాసియా సేవకులకు అందజేశారు. మూడు రథాలపై ఆశీనులు కానున్న దేవతల కోసం సౌకర్యవంతమైన దిండ్లు, ఉడా చందువా కట్టు పనులు తుది దశలో రూపుదిద్దుకుంటున్నాయి. మరో వైపు కొఠొ సుంవాసియా సేవకులు 3 రథాల 12 ద్వారాలకు వస్త్రాలంకరణ పూర్తి చేశారు.
చందువా విభిన్నం
క్రమ పద్ధతిలో ఆకర్షణీయమైన రంగుల మేళవింపుతో దర్జీలు కుట్టి సిద్ధం చేసిన వస్త్రం చందువాగా ప్రతీతి. పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతం చందువాకు ప్రసిద్ధి. నైపుణ్యం కలిగిన కళాకారులు రంగురంగుల వస్త్ర ముక్కలను చేతితో కత్తిరించి, కుట్టడం ద్వారా రథాలను అలంకరించే అద్భుతమైన పైకప్పులను, ఆకర్షణీయమైన వస్త్ర కప్పులను రూపొందిస్తారు. దర్జీల ప్రతి కుట్టులో హృదయ పూర్వక భక్తి, అద్భుతమైన పనితనం మరియు సంప్రదాయం మిళితమై ఉంటాయి. ఒడిశాకు చెందిన శతాబ్దాల నాటి చందువా కళా సంస్కృతి ఆప్లిక్ కళగా జీఐ ట్యాగ్ సాధించింది. దీన్ని పూరీ రథ యాత్ర కోసం ప్రత్యేకంగా చేతి పనితో తయారు చేయడం విశేషం. రథాల యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో పిప్పిలి చందువా ఉనికి ప్రత్యేకం. పిప్పిలి ప్రాంతపు దర్జీలు యాత్ర రథాల వస్త్రాలంకరణలో ముందంజ పాత్ర పోషిస్తారు. చందువా ప్రతి రథానికి అలంకార వస్త్ర పైకప్పులుగా చూడ ముచ్చట గొలిపిస్తాయి. ఈ బహుళ వన్నెల వస్త్రాల అమరికతో సామాన్యుడు సైతం ఏ రథం ఏ దేవునిదో సులభంగా గుర్తించగలుగుతాడు.
శ్రీ జగన్నాథుని పవిత్ర రథాల తొలి పరిచయం ఆయా రథాల వస్త్రాలంకరణ. వార్షిక యాత్రలో మూల విరాట్లు 3 వేర్వేరు రథాల్లో శ్రీ గుండిచా మందిరానికి తరలి వెళ్తారు. ఒక్కో రథం ఒక్కో వన్నెతో కనులు మిరమిట్లు గొలిపిస్తుంది. విభిన్న రంగుల వస్త్రాల్ని ప్రత్యేకమైన మేళవింపుతో జోడించి రథాల పైభాగం నిండుగా కప్పడంతో చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. రథాల వర్ణం ఆధారంగా దేవతా మూర్తుల రథాల్ని గుర్తు పెట్టుకునే భక్తులు, యాత్రికులు కోకొల్లలు. ఈ మూడు రథాలను అలంకరించడానికి మొత్తం మీద 1,250 మీటర్ల వస్త్రాన్ని ఉపయోగిస్తారు.
శ్రీ జగన్నాథుడు యాత్ర చేసే నందిఘోష రథం అలంకరణలో 425 మీటర్ల వస్త్రం వినియోగిస్తారు. ఈ అలంకరణలో ఎరుపు, పసుపు వర్ణాల వస్త్రం వినియోగిస్తారు.
బలభద్ర స్వామి ఆశీనుడయ్యే తాల ధ్వజం ఎరుపు మరియు ఆకుపచ్చని రంగుల మేళవింపుతో 425 మీటర్ల వస్త్రంతో చుట్టుకుని ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది.
దేవి సుభద్ర యాత్ర చేసే దర్ప దళనం 400 మీటర్ల సువిశాల ఎరుపు, నలుపు రంగుల కలయికతో కుట్టి సిద్ధం చేసిన వస్త్రాలతో ముస్తాబు అవుతుంది.


