పాఠశాలలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో అగ్నిప్రమాదం

Jul 15 2026 12:23 AM | Updated on Jul 15 2026 12:23 AM

పాఠశాలలో అగ్నిప్రమాదం

● సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం

పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని జగన్నాథ మందిరం వద్ద ఉన్న శ్రీసత్యసాయి విద్యామందిర్‌ పాఠశాలలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. కంప్యూటర్‌ గదిలో పోగ రావడాన్ని గమనించిన విద్యాలయం సిబ్బంది అప్రమత్తమై అక్కడ నుంచి విద్యార్థులను బయటకు తరలించారు. ఫలితంగా పెద్ద ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్పిమాపకదళం ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంతో కంప్యూటర్‌ గదిలో కొన్ని వస్తువులు కాలిబూడిదయ్యాయి. అయితే ప్రమాదానికి కారణం ఇంతవరకూ తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement