రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Jul 13 2026 12:58 AM | Updated on Jul 13 2026 12:58 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పోలీసులు గంజాయి అక్రమ రవాణా గుట్టును రట్టు చేసి భారీ విజయం సాధించారు. శనివారం రాత్రి ఐఐసీ ప్రభుదత్త బిస్వల్‌ ఆదేశాలతో ఎస్‌ఐ ప్రశాంత్‌ కుమార్‌ సాబత్‌ నాయకత్వంలో పోలీసుల ప్రత్యేక బృందం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అటవీ ప్రాంతంలో గంజాయిని దాచిపెట్టినట్టు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా బోడిగేటా–బేజాంగ్‌వాడ గ్రామాల మధ్య అడవిలో గంజాయి బస్తాలు తరసపడ్డాయి. దీంతో 41 బస్తాల్లో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం కలిమెల తహసీల్దార్‌ రామకృష్ణ సత్య రాజగురు సమక్షంలో తూకం వేయగా మొత్తం ఒక 1015 కిలోలు ఉన్నట్లు తేల్చారు. దీని విలుల బహిరంగ మార్కెటో సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసు అధికారి వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ గంజాయి ఎవరిదో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement