భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు సోదర సోదరీ సమేతంగా ఆరోగ్యంతో కోలుకున్నాడు. జ్యేష్ట పూర్ణిమ మొదలుకొని స్వామి అస్వస్థతకు గురై తెర చాటున గోప్య సేవలు, ఉపచారాలు పొందుతున్న విషయం తెలిసిందే. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షనలో రాజ వైద్య వర్గం అందించిన సేవలతో స్వామి కోలుకున్నాడు. జగతి నాథుని ఆరోగ్యం పట్ల కలవరపరడుతున్న పూరీ గజపతి మహా రాజాకు రాజ వైద్య వర్గం తీపి కబురు చేర్చింది. పవిత్ర త్రయోదశి పురస్కరించుకుని ఆది వారం రాజ ప్రసాద్ విజే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గజపతి మహా రాజాకు శ్రీ జగన్నాథుడు ఆరోగ్యంతో కోలుకున్న విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ అంగాలకు సమర్పించిన ఇతర వస్తువులను గజపతి మహా రాజాకు అందజేశారు.


