జయపురం: తెలుగు సాంస్కృతిక సమితి జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ‘జనాభా మరియు పర్యావరణ అవగాహణ’ అనే అంశంపై చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 57 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలుగా స్వేతా సింగ్(9 వ తరగతి) వి.సుప్రియ (10వ తరగతి), ఎ.జ్ఞానేశ్వరి(10వ తరగతి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. 9వ తరగతి విద్యార్థినికి ప్రత్యేక బహమతి లభించింది. ఇకో క్లబ్ ఇన్‌చార్జ్ ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్ పట్నాయక్ పర్యవేక్షణంలో నిర్వహించబడిన కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం బి.సుజాత, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు పి.శశిభూషణ పట్నాయక్, ఉపాధ్యాయులు సుశ్మిత పాత్రో, కె.పద్మాదేవి, వందిత పాణిగ్రహి, సి.హెచ్.మానసి పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం, పాత బాలాజీ ఆలయ ప్రాంగణంలోనూ విద్యార్థులు మొక్కలు నాటారు.


