పశువులు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పశువులు పట్టివేత

Jul 13 2026 12:58 AM | Updated on Jul 13 2026 12:58 AM

రణస్థలం: లావేరు మండలం రావివలస జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం శ్రీకాకుళం వైపు వెళుతున్న లగేజ్‌ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఏడు గేదెలను పోలీసులు పట్టుకున్నారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ స్థాయి కథల పోటీలకు ఆహ్వానం

శ్రీకాకుళం కల్చరల్‌: బండికల్లు వేంకటేశ్వరులు ఫౌండేషన్‌, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో 10వ జాతీయ స్థాయి కథల పోటీలకు కథలను ఆహ్వానిస్తున్నట్లు అధ్యక్షులు బండికల్లు జమదగ్ని, కలిమిశ్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు కథకులు ఎక్కడ ఉన్నా పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. కుటుంబ గౌరవం, నైతిక విలువలను తెలియజేసే కథలు, సమాజంలో తాజా మార్పులు, సమస్యలు చూపుతూ వాటికి చక్కని పరిష్కారాలను తెలిపే కథలను ‘బండికల్లు జమదగ్ని, ఫ్లాట్‌ నెం.402, హిమజ టవర్స్‌, 3/10 బ్రాడీపేట, గుంటూరు –522002’ చిరునామాకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 98482 64742 నంబరును సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement