ప్రమాదకర ప్రయాణం.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకర ప్రయాణం..

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

కొరాపుట్‌: విధి నిర్వాహణ కోసం మహిళల ప్రమాదకర ప్రయాణం సాగుతుంది. నబరంగ్‌పూర్‌ జిల్లా తెంతులకుంటి సమితి మంచాగాం గ్రామ పంచాయతీ కెందుగుడ అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో నువా డెప్పుగుడ గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. నువా డెప్పుగుడ అప్పర్‌ ఇంద్రావతి హైడ్రో పవర్‌ ప్రోజెక్ట్‌ కోసం నిర్మించిన భారీ రిజర్వాయర్‌ మధ్య కొండ ఉంది. ఈ గ్రామంలో పలు గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామం వెళ్లడానికి ఎటువంటి మార్గం లేదు. కనీసం ఇంధన పడవ సౌకర్యం కూడా లేదు. దీంతో ఆశ కార్యకర్త ద్రౌపది జానీ, అంగన్‌వాడీ కార్యకర్త టిల్‌ శాంత నిత్యం నాటు పడవతో ఆ గ్రామానికి వెళ్లి పిల్లల సంరక్షణ చూస్తున్నారు. ఇటువంటి ప్రమాదకర ప్రయాణం చేస్తున్న మహిళల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement