ధ్రువీకరణ పత్రాలు అందజేత | - | Sakshi
Sakshi News home page

ధ్రువీకరణ పత్రాలు అందజేత

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి పరసనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజశిర్కే ఆధ్వర్యంలో భీమాభోయి దివ్యాంగ సాధికరత శిబిరం నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వ పథకాలు, సేవల అమలుపై సమీక్షించారు. దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని అందించారు 77 మందికి చలన వైకల్య ధ్రువపత్రాలు, 8 మందికి మోధో వైకల్య, 23 మందికి దృష్టి వైకల్య, 31 మందికి వినికిడి, దృష్టి, మాట వైకల్య ధ్రువపత్రాలను అందజేశారు. ఏడుగురికి భద్రతా పెన్షన్‌, నలుగురికి బస్‌ పాస్‌లు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement