కొత్త రైల్‌ మార్గానికి రీఅలైన్‌మెంట్‌ సర్వే చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొత్త రైల్‌ మార్గానికి రీఅలైన్‌మెంట్‌ సర్వే చేయాలి

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

రాయగడ: దాదాపు లక్షన్నర మంది ప్రజలు రైల్వే సౌకర్యానికి దూరంగా ఉన్న రాయగడ జిల్లాలోని గుడారి ప్రాంతానికి రైల్వే అనుసంధానం కల్పించే దిశగా కీలక అడుగు పడింది. ప్రతిపాదిత గొపాల్‌పూర్‌–రాయగడ కొత్త రైల్వే మార్గాన్ని గుడారి మీదుగా రియలైన్‌మెంట్‌ చేసి సర్వే నిర్వహించేందుకు ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కు కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక లేఖ పంపించారు. గుడారితొ పాటు పరిసర ప్రాంతాల్లొ నివసిస్తున్న సుమారు 1.5 లక్షల మంది ప్రజలు ఇప్పటికే రైల్వే సౌకర్యానికి నొచుకొలేదని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్ధిక అభివృధ్దికి రైల్వే అనుసంధానం అత్యంత అవసరమని వివరించారు. ప్రతిపాదిత గొపాల్‌పూర్‌–రాయగడ కొత్త రైల్వే మార్గానికి ప్రత్యామ్నాయంగా అఖకుసింగి,నైరా,గుడారి, బంకిలి లేదా దుర్గి మార్గాన్ని పరిశాలించి దానిని ప్రతిపాదిత గుణుపూర్‌ –తెరువలి రైల్వే మార్గంతొ అనుసంధానం చేసే అవకాశాలను అధ్యయనం చేయాలని కొరారు. గుడారి రైల్వే సౌకర్యం అందుబాటులొకి వస్తే ప్రజలకు వైద్య సేవలు, ఉన్నత విద్య, వ్యవసాయ అలాగే తదితర ఉత్పత్తులకు మార్కెట్‌ సదుపాయాలు ,ఉపాధి అవకాశాలు మరింత చేరువవుతాయని పేర్కొన్నార. అంతేకాకుండా ఈ ప్రాంత ఆర్ధికాభివృధ్ది కి, రవాణా వ్యవస్ధ బలొపేతానికి కూడా ఈ ప్రాజెక్టు దొహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement