సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఒడిశా మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి గోకులానంద్ మల్లిక్, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, గిరిజన సహకార సంస్థ వైస్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక దర్శించుకున్నవారిలో ఉన్నారు. వీరంతా ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అర్చకులు ఆయన పేరిట అష్టోత్తరశతనామావళి పూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదంని దేవస్థానం ఈవో జె.వెంకటరావు అందజేశారు.


