పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని జగన్నాథ మందిరం వెలుపల రథయాత్ర కోసం తయారవుతున్న మూడు రథాలను తిలకించడానికి శనివారం ఉద యం ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు. పట్ట చిత్రాలలో ఉన్న ఆదినారాయణ, అనంతవాసుదేవుడు, భుభనేశ్వరీ దేవదేవుళ్లును దర్శించుకున్నారు. ఈ మూడు రథాల శిల్పకారుడు అశోక్ మహారాణాను కలిసి మాట్లాడారు. రథం నందిఘోషకి 16 చక్రాలు, రథసారధిగా దారుక, బలరాముని తాల ధ్వజ రథానికి 14 చక్రాలు, రథసారథి మాతలి, సుభ ద్ర రథం దర్పదళన 12 చక్రాలతో స్వయాన అర్జునుడు రథసాఽరధిగా వ్యవహారిస్తాడు. వచ్చే సోమవారంతో ఈ మూడు రథాలకు చివరిగా రాహు, కేతు లు, గుర్రాలు, అనేక దేవతలు, విమలా దేవి, వన దుర్గ, ఉగ్రతార, చండీ, మంగళ, ఇతర శక్తుల చిత్రపటాలును అతికిస్తున్నారు. రథాల తయారీకి రాత్రింబవళ్లు పనిచేస్తున్న కారగార్ (శిల్పులు)కు ఎమ్మెల్యే ఉత్తరీయం, ఇత్తడి ప్లేటును ఇచ్చి సత్కరించారు.


