కేజీబీవీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు

Jul 11 2026 1:12 AM | Updated on Jul 11 2026 1:12 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్విద్‌ రాజ్‌శిర్కే ప్రత్యేక పర్యవేక్షణలో జిల్లా ఆరోగ్యశాఖ కీలక ఆరోగ్య సేవాకార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఉన్న ఏడు కస్తూర్బాగాంధీ ళబాలికా విద్యాలయాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగాంగా కేజీబీవ్లో చదువుతున్న 1320 మంది విద్యార్థినులను మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేయిస్తోంది. ఇప్పటి వరకు రెండు పాఠశాలల్లోని విద్యార్థినులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. విగిలిన ఐదు పాఠశాలల్లో కూడా రెండు..మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రతి విద్యారి్‌థనికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం, మందులు, ఆరోగ్య సలహాలు అందించేందుకు ఆరోగ్య శాఖాబృందాలు పనిచేస్తున్నాయి. కలెక్టర్‌ మాట్లాడూతూ.. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా చేయడమే లక్ష్యమన్నారు.

గంజాయి పట్టివేత

మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు గురువారం రాత్రి 92 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం సాయంత్రం బలిమెల – చిత్రకొండ ముఖ్య రహదారి వద్ద పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న కారు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే వాటిని ఆపకుండా అతివేగంగా వెళ్లారు. దీంతో వాటిని పోలీసులు వెంబడించారు. పోలీసుల రాకను గమనించిన దుంగడులు వాహనాలను వదిలి పరారయ్యారు. అనంతరం కారులో తనిఖీ చేయగా 4 బస్తాల్లో గంజాయిని గుర్తించారు. వెంటనే కారు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ చిత్రకొండ తహసీల్దార్‌ ప్రశాంత్‌ భత్ర నేతృత్వంలో ఐఐసీ దేవదత్త మల్లిక్‌ పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 92 కేజీలు ఉంది. దీని విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని తెలిపారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న 91 ఆవులు పట్టివేత

జయపురం: అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న 91 ఆవులను జయపురం పట్టణ పోలీసులు హిందూ సమాజ్‌ యువకుల సహకారంతో శుక్రవారం రక్షించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసుస్టేషన్‌ అధికారి ఉల్లాస్‌ చంద్రరౌత్‌ తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర పంగి నేతృత్వంలో పోలీసు బృందం వెంటనే దాడి జరిపి పశువులను రవాణా చేస్తున్న కంటైనర్‌ వాహనాన్ని అడ్డగించారు. దాన్ని పరిశీలించగా అందులో 91 ఆవులు బయటపడ్డారు. కంటైనర్‌ డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకొని విచారించగా తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రషీద్‌ అనే వ్యక్తి ధర్మఘడ్‌లో పశువులను కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మానాపురం మీదుగా హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆవులను కుంత్రకల్‌ గ్రామం వద్ద గల జయపురం మున్సిపాలిటీ వారి గోశాలకు తరలించినట్లు వెల్లడించారు. అచ్చట గోసంరక్షకులు ఆవులకు వైద్యం చేయించి ఆహారం సమకూర్చారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement