● జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి డిమాండ్
జయపురం: అవిభక్త కొరాపుట్ యువతకు ఉద్యోగాలు కల్పించాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పనకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. శుక్రవారం స్థానికి పారాబెడలోని ఓ కల్యాణ మండప ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉద్యోగాల నియామకంలో అవిభక్త కొరాపుట్ యువకులపై పాలకులు చూపుతున్న పక్షపాత వైఖరిని తూర్పార పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా స్థాయిలో ఉద్యోగాల నియామకాలు జరిగేవని గుర్తు చేశారు. బీజేడీ, బీజేపీ ప్రభుత్వాల హయాంలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగ యువత అవస్థలు పడుతున్నాయన్నారు. యువత ఉద్యోగాలకు దూరమై వలస కార్మికులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో లక్ష్మిపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీణాక్షీ బాహిణీనతి, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రూపక్ తురుక్, మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే నిమయి చరణ సర్కార్, పార్టీ సీనియర్ నేతలు బినోద్ మహాపాత్రో, నిహారీ బిశ్వాల్, బసంత నాయిక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపాలిటీ నరేంద్రకుమార్ మహంతి, జయపురం సమితి కాంగ్రెస్ అధ్యక్షులు బసంత నాయిక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నళినీరథ్ పాల్గొన్నారు.


