కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి రాణిగఢ్ మీదుగా బొరిగుమ్మ వెళ్లే మార్గం అత్యంత ప్రమాదకరంగా మారింది. గత పది రోజులుగా కురుస్తున్న భారా వర్షాలకు ఈ మార్గం బాగా దెబ్బతింది. ఈ విషయం తెలియని అనేక భారీ వాహనాలు జీపీఎస్‌ను అనుసరిస్తూ ఈ గోతులలో కూరుకు పోతున్నాయి. విశాఖ పట్నం–రాయ్‌పూర్ జాతీయ రహదారి పై ప్రయాణం చేసే వాహనాలు 13 కిలో మీటర్ల దూరం తగ్గుతుండడంతో జయపూర్ వెళ్లకుండా రాణిఘఢ్ మార్గం ఎంచుకుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. అనేక ఇతర రాష్ట్రాల వాహనాలు బురదలో చిక్కుకు పోయాయి. వాహన దారులను రక్షించే నాథుడు కరువయ్యాడు. నిత్యం కొరాపుట్ నుంచి మెకానిక్‌లు వెళ్లి వాహనాలు వెలికి తీయడానికి రాత్రింబవళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు.


