జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణ ముదిలికి బొయిపరిగుడ ఆదివాసీ మహా సంఘం కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం ఆదివాసీ మహాసంఘ్ అధ్యక్షుడు భక్త రామ్ నాయక్, కార్యదర్శి సను తెంతులిపొడియ నేతృత్వంలో సంఘ్ కార్యకర్తలు పోలీసు అధికారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బొయిపరిగుడ పోలీసు అధికారితో సమితిలో శాంతిభద్రతలపై చర్చించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దొంగతనాలు, నేరాలు అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ మహాసంఘ్ అద్యక్ష, కార్యదర్శులతో పాటు లలిత పూజారి, లక్ష్మణ పూజారి, ధనపతి నాయక్,అభి నాయక్, ధనసాయి పొరజ, కృష్ణ శాంత, సురేంద్ర ముదులి తదితరులు అధికారికి స్వాగతించారు.


