రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి

Jul 10 2026 7:34 AM | Updated on Jul 10 2026 7:34 AM

రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి

సంతబొమ్మాళి: జీవనోపాధి కోసం జిల్లాకు వచ్చిన వలస కూలీ సంతబొమ్మాళిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉమారియా జిల్లా దడకా గ్రామానికి చెందిన పుష్పరాజ్‌ సింగ్‌, ధర్మపాల్‌ సింగ్‌లు ఆరు నెలల క్రితం భద్రాచలం నాగేశ్వరరావుకు చెందిన రంగనాథ బోర్‌ వెల్స్‌లో దినసరి కూలీలుగా చేరారు. దీనిలో భాగంగా బుధవారం రాత్రి సంతబొమ్మాళిలో బోరు వేసేందుకు వచ్చారు. భోజనాలు చేసి బహిర్భూమికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వేగంగా వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న పుష్పరాజ్‌సింగ్‌ మృతి చెందగా..వెనుక ఉన్న ధర్మపాల్‌సింగ్‌కు గాయాల య్యాయి. ప్రమాదం గమనించిన స్థానికులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొ మ్మాళి ఎస్సై వై.సింహాచలం గురువారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement