ఉప రాష్ట్రపతికి గవర్నర్‌ విందు | - | Sakshi
Sakshi News home page

ఉప రాష్ట్రపతికి గవర్నర్‌ విందు

Jul 10 2026 7:34 AM | Updated on Jul 10 2026 7:34 AM

భువనేశ్వర్‌: ఒక రోజు రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్‌ గౌరవార్థం రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరి బాబు కంభంపాటి గురువారం నాడు లోక్‌ భవన్‌న్యూ అభిషేక్‌ హాల్‌లో అధికారిక విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రథమ మహిళ డాక్టర్‌ జయశ్రీ కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (లాలన్‌ సింగ్‌), అదే శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్‌ ఎస్పీ సింగ్‌ బఘేల్‌, రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ సురమా పాఢి, డిప్యూటీ స్పీకర్‌ భబానీ శంకర్‌ భోయ్‌, న్యాయ, ప్రజా పనులు, అబ్కారి శాఖ మంత్రి పృథ్వీ రాజ్‌ హరిచందన్‌, ఉన్నత విద్య, క్రీడలు – యువజన సేవలు, ఒడియా భాష, సాహిత్యం – సంస్కృతి శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్‌, సహకార, చేనేత, వస్త్ర, హస్త కళల శాఖ మంత్రి ప్రదీప్‌ బల్‌ సామంత, మత్స్య, పశు సంపద అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి గోకులానంద మల్లిక్‌, ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి అనూ గర్గ్‌, అభివృద్ధి కమిషనర్‌ దేవ్‌ రంజన్‌ కుమార్‌ సింగ్‌, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. విందు అనంతరం గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి ఉప రాష్ట్రపతికి, ఇతర ప్రముఖులకు మహా ప్రభువు శ్రీ జగన్నాథుని పవిత్ర రథాన్ని పోలిన తారొకొసి (వెండి తీగల అల్లిక) హస్త కళా స్మారక చిహ్నాలను బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement