ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Jul 10 2026 7:34 AM | Updated on Jul 10 2026 7:34 AM

రాయగడ: సదరు సమితిలోని ఒడ్డుగుడ గ్రామ సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం 77వ వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మేజిస్ట్రేట్‌ దామోదర్‌ రథో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. జీవనాధారమైన మొక్కలను ప్రతీ ఒక్కరూ నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్పెషల్‌ జడ్డి సంజిత్‌ కుమార్‌ బెహరా, అదనపు జిల్లా జడ్డి అల్పన స్వయి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా స్థానిక ప్రేమ్‌ పహాడ్‌ వద్ద లేడిస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో క్లబ్‌ మహిళలు పెద్ద సంఖ్యలొ పాల్గొని పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. క్లబ్‌ అధ్యక్షురాలు కస్తూరీ సాహు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలకాదాస్‌, కార్యదర్శి జ్యోతి ప్రభ మహాపాత్రో, కోశాధికారి బి.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement