అంబులెన్స్‌లో ప్రసవం | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌లో ప్రసవం

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

రాయగడ: అంబులెన్స్‌లో గర్భిణి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు. జిల్లాలోని గుడారి సమితి పరిధి చాకుండా గ్రామానికి చెందిన భాను జగరంగా అనే గర్భిణికి సోమవారం ప్రసవ వేదన ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పద్మపూర్‌ నుంచి అత్యవసర వైద్య సిబ్బంది (ఈ.ఎం.టి) యుగళ్‌ కిశోర్‌ సబర్‌, డ్రైవర్‌ ఎం.మాధవ్‌, సహాయకుడు రవి సబర్‌, ఆశా కార్యకర్త జ్యొతి మాఝి పద్మపూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. మార్గమధ్యలో బడనాల సమీపానికి చేరుకునే సరికి ప్రసవ వేదనలు తీవ్రంగా పెరగడంతో అంబులెన్స్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈఎంటీ, ఆశ కార్యకర్త సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. తల్లి, శిశువును వెంటనే పద్మపూర్‌ సీహెచ్‌సీకి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాయగడ వంటి మారుమూల ప్రాంతాల్లో రవాణా సమస్యలు కారణంగా గర్భిణిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యలో 108 అంబులెన్స్‌ సిబ్బంది ఇద్దరి ప్రాణాలను కాపాడటంపై ప్రజలు అభినందనలు తెలిపారు.

క్షతగాత్రుడిని రక్షించిన వైద్యుడు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి బైక్‌పై వస్తూ అకస్మాతుగా పడిపోయాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. సమీపంలో ఉన్న వైద్యుడు దేవీప్రసాద్‌ నాథ్‌ వెంటనే సంఘటన స్థలాని చేరుకుని స్థానికుల సహయంతో క్షతగాత్రుడిని పరీక్షించారు. సృహ లేకపోవడంతో వెంటనే ప్రాథమిక చికిత్స అందజేశారు. కొద్ది సమయం తరువాత సృహలోకి రావడంతో అటుగా వస్తున్న విద్యుత్‌శాఖ వాహనం ఆపి మైరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు చేసిన ఈ సహాయాన్ని స్థానికులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement