పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీ, ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాల డీన్ ఎస్పీ నందా, సి.సి.డి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అడ్డాల జగన్నాథ రాజుతో సహా నలుగురు ఉద్యానవనశాఖ అధ్యాపకులు బృందం రాయఘడ బ్లాక్ మండలసాయి పంచాయతీలో సింధిబా గ్రామంలో ఉన్న ఐ.టి.డి.ఎ గజపతి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు. జిల్లాలో ఏకై క పైనాపిల్ ఫుడ్ స్లయిసెస్ యూనిట్‌ను ప్రభుత్వం రూ.60 లక్షలతో నిర్మించింది. దీనిని మిషన్ శక్తి మహిళా స్వయం సహాయక గ్రూపు నడిపిస్తుంది. జిల్లాలో 70 గ్రామాల్లో పండుతున్న పైనాపిల్ పంట రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో అనాస పనస ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మూతబడింది. దీనిని సెంచూరియన్ వర్సిటీ కొనుగోలు చేయాడానికి ముందుకు రావడంతో కొంతమంది బృందం సింధిబా గ్రామానికి వెళ్లి అధ్యయనం చేశారు. ప్రస్తుతం సాధారణ నేల అనాస వంద పండ్లు రూ.400 మాత్రమే ధర పలుకుతుంది. అదే క్వీన్ రకం అనాస రూ.50లు (ఒకటి) పలుకుతుంది. త్వరలో అనాస పనస ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సెంచూరియన్ వర్సిటీ కొనుగోలు చేసి అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యార్థుల పరిశోధనకు వినియోగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు వర్సిటీ అధ్యయన బృందం సభ్యుడు డాక్టర్ ఎస్పీ నందా తెలిపారు.


