● ఇద్దరు దుర్మరణం
భువనేశ్వర్: సుందర్‌గడ్ జిల్లా పట్‌కిజోర్ ఘాటి సమీపంలో మంగళ వారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బొలెరో, కమాండర్ వాహనాలు ముఖాముఖి ఢీకొన్నాయి. ఢీకొన్న తర్వాత బొలెరో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లగా కమాండర్ వాహనం నుజ్జునుజ్జు అయింది. దీంతో ఘటనా స్థలంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు పైబడి వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం సుందర్‌గఢ్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు


