ఘనంగా ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

Jul 8 2026 1:14 AM | Updated on Jul 8 2026 1:14 AM

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని మెయిన్‌ రోడ్డులో బాలాజీ ఆలయ 17వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఆలయం నుంచి మెయిన్‌ రోడ్డులో స్వామి వారిని ఊరేగించారు. తెలుగు ప్రజలు ఊరేగింపులో పాల్గొన్నారు. స్వామి వారికి తిరుమంజనం, కల్యాణ మహోత్సవాలు జరిగాయి. మధ్యాహ్నం అన్నప్రసాద సేవనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం పక్కనే నిర్మిస్తున్న కల్యాణ మండపం పని తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. సాయంత్రం సాముహిక కుంకుమార్చనలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో డాక్టర్‌ ధనుంజయ్‌ పట్నాయక్‌, రవి రెడ్డి, నందికేశ్వర్‌, అట్టి సురేష్‌ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement