గజపతి ఎస్‌డీసీ చైర్మన్‌గా కామదేవ్‌ బోడోనాయక్‌ | - | Sakshi
Sakshi News home page

గజపతి ఎస్‌డీసీ చైర్మన్‌గా కామదేవ్‌ బోడోనాయక్‌

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా స్పెషల్‌ ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్‌ పరిషత్‌ చైర్మన్‌గా కామదేవ్‌ బోడోనాయక్‌, వైస్‌ చైర్మన్‌గా పంకజినీ దోళాయి నియమితులయ్యారు. దీంతో శనివారం పర్లాకిమిడి జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు నారాయణ రావు, జిల్లా అధ్యక్షులు నబకిశోర్‌ శోబోరో, ఛిత్రి సింహాద్రి, సాధారణ కార్యదర్శి ఇ.ప్రశాంత్‌, ఎంపీ ప్రతినిధి రాజేష్‌కుమార్‌, రౌతు విజయకుమార్‌, బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలక్రిష్ణ పాత్రో, కౌన్సిలరు బిభూతీ భూషణ్‌ బెహారా, కె.జీవన్‌రావు, ప్రసాద్‌ నాయుడు నూతన చైర్మన్‌ కామదేవ్‌ బోడోనాయక్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్‌డీసీ చైర్మన్‌ పదవి ఏడాదిన్నరగా భర్తీకాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఎట్టకేలక పాలకవర్గాన్ని నియమించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్‌ మఝికి గజపతి జిల్లా బీజేపీ శ్రేణులు ధన్యవాదాలు తెలియజేశారు.

పిచ్చికుక్క కాటుతో ఆవు మృతి

పాలు తాగిన వారంతా ఆస్పత్రికి పరుగులు

కొరాపుట్‌: పిచ్చికుక్క కరవడంతో ఆవు చనిపోయింది. ఈ ఘటన నబరంగ్‌పూర్‌ జిల్లా ఉమ్మర్‌కోట్‌ పట్టణంలోని 12వ వార్డులో శనివారం చోటుచేసుకుంది. ఆసుర్‌ రాయ్‌కి చెందిన ఆవు కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుండేది. దీంతో యజమాని ఆసుర్‌ రాయ్‌ ఆవుని పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పిచ్చికుక్క కరిచిందని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆవు శనివారం ప్రాణాలు కోల్పోయింది. కాగా సుమారు నెల రోజులుగా ఆవు పాలు వినియోగిస్తున్న వినియెగిస్తున్న సుమారు 30 ఇళ్లలో అలజడి రేగింది. వీరంతా రాయ్‌ వద్ద ఆవుపాలు కొనుగోళ్లు చేస్తుండేవారు. పిచ్చికుక్క కరవడంతో ఆవు చనిపోయిందనే సమాచారం తెలుసుకున్న వారంతా భయంతో ఉమ్మర్‌ కోట్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. ఇప్పటికే 15 మంది పిల్లలు, 20 మంది పెద్దలు వ్యాక్సిన్‌ వేయించుకున్నారని వైద్యులు ప్రకటించారు.

ఖంజావీధిలో

యువతి ఆత్మహత్య

పర్లాకిమిడి: పట్టణంలో ఖంజావీధిలో యువతి (అవివాహిత) శుభ్రా సామల్‌ (24) స్వగృంలో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన 15వ వార్డులో సంచలనం కలిగించింది. ఆదర్శ పోలీస్‌ స్టేషన్‌ ఐఐసీ ప్రశాంత్‌ భూపతి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును దర్యా ప్తు చేశారు. ఇటీవలే మంచి మార్కులతో పాసై న శుభ్రా సామల్‌ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నా రు. ఈమెకు ఇద్దరు అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆదర్శ పోలీసు ష్టేషన్‌ అధికారులు, క్లూస్‌ టీమ్‌ దర్యాప్తు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement