భువనేశ్వర్: రాష్ట్ర అత్యవసర స్పందన కేంద్రం (ఎస్‌ఈఆర్‌సీ) ఉద్యోగులు సామూహికంగా సమ్మె ప్రారంభించారు. 112 వాహనాల సేవలు నిలిపివేశారు. న్యాయసమ్మతమైన తమ డిమాండ్లు నెరవేర్చకుంటే పీసీఆర్ జాడ లేకుండా పోతుందని స్పష్టం చేశారు. కాల్ సెంటర్ ఉద్యోగులకు గత 5 నెలలుగా జీతాలు అందలేదన్నారు. ఉద్యోగులకు ఏడాదిగా ఈపీఎఫ్ జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టేంత వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. జీతాలు అందే వరకు సమ్మె నిరవధికంగా కొనసాగిస్తామన్నారు. ఈ నిరసన కారణంగా 112 సేవలు ప్రభావితమయ్యాయి.


