చేనేత క్లస్టర్‌ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

చేనేత క్లస్టర్‌ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

పొందూరు: చేనేత క్లస్టర్‌ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ మీనా అపనేందర్‌, డిజైనర్‌ గౌరంగ్‌షా అన్నారు మండలంలోని రాపాక కూడలి సమీపంలో గల 310 సర్వే నంబర్‌లో ఉన్న ఐదు ఎకరాల్లో చేనేత క్లస్టర్‌ ఏర్పాటు గురువారం స్థలాన్ని పరిశీలించారు. చేనేత క్లస్టర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అధునాతన డిజైన్ల తో చేనేత వస్త్రాలను రూపొందించడంతో మార్కెటింగ్‌ విస్తృతమవుతుందని అన్నారు. స్థల పరిశీలన చేసిన వారిలో ఆర్కిటిక్‌ నీలేష్‌, రీసర్వే డీటీ రాధాకృష్ణ, మండల సర్వేయర్‌ గణపతి, ఈఓ పొన్నాడ జగదీష్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గిరిజన బాలిక హత్యపై ఆరా

హిరమండలం: జిల్లాలో ఇటీవల జరిగిన గిరిజన బాలిక హత్యపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ కె.హరిబాబు గురువారం ఆరా తీశారు. ఈ కేసులో నిందితుడు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక తహసీల్దార్‌ బాలకృష్ణతో పాటు పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సైతం పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రేమసాయి వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ హరిబాబు సందర్శించారు. ఆశ్రమవాసుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా న్యాయసంబంధ సమస్యలు ఉన్నా, ప్రభుత్వ పథకాలు అందకపోయినా, పింఛన్లు అందకపోయినా విన్నవించాలని కోరారు.

అనధికార ర్యాంప్‌పై దాడులు

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని కిల్లిపాలెం పరిసర ప్రాంతం కలెక్టరేట్‌ సమీపంలో గల నాగావళి నదీ తీరాన గడిచిన కొన్ని నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న అనధికారిక ఇసుక ర్యాంప్‌పై జిల్లా మైన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సి.మోహన్‌రావు నేతృత్వంలో గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక జేసీబీతో పాటు ఒక ట్రాక్టర్‌ను మైన్స్‌ అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మైన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం పరిధిలోని ఎవరైనా అనధికారికంగా ఇలాంటి ర్యాంప్‌లను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా యంత్రాంగం ఇచ్చిన అనుమతులు మేరకు మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని, వాల్టా చట్టాన్ని అధిగమించకూడదన్నారు.

‘పనుల్లో జాప్యం వద్దు’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజల అవసరాల కోసం కేటాయించిన ఎంపీ లాడ్స్‌ నిధులు ప్రతి పైసా సద్వినియోగం కావాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన 17, 18వ లోక్‌సభ ఎంపీ లాడ్స్‌ నిధుల సమీక్షలో ఆయన పాల్గొని, నిధుల వినియోగంపై శాఖల వారీగా విశ్లేషణ చేశారు. పనులు పూర్తయిన వెంటనే వాటికి సంబంధించిన ఫొటోలను ‘ఈ–సాక్షి’ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని, అప్పుడే నిధుల విడుదల వేగవంతం అవుతుందని అధికారు లను ఆదేశించారు. పంచాయతీ రాజ్‌ శాఖలో ఇంకా 76 పనులు, విద్యుత్‌ శాఖలో 42 పనులు పెండింగ్‌లో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కార్యనిర్వాహక ఇంజినీర్లను ఆదేశించారు.

‘పోషణ్‌ పక్వాడాను విజయవంతం చేయండి’

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 వరకు నిర్వహించనున్న పోషణ్‌ పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐసీడీఎస్‌ పీడీ కె.రూపలత పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోగల ఐసీడీఎస్‌ జిల్లా కార్యాలయంలో గురువారం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌లు, సీడీపీఓలతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా రూపలత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో ఈనెల 9వ తేదీ నుంచి 8వ పోషణ్‌ పక్వాడా కార్యక్రమాన్ని అందరు అంగన్‌వాడీలు చేపట్టేలా చూడాలన్నారు.

రాపాక కూడలి సమీపంలో చేనేత క్లస్టర్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

మాట్లాడుతున్న రూపలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement