నిర్మానుష్యంగా కంటామాల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మానుష్యంగా కంటామాల్‌

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

రాయగడ: జిల్లాలోని కాసీపూర్‌ పరిధిలో పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ పలు గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాలను విడిచి వేరే ప్రాంతంలో తలదాచుకునేందుకు వెళ్లడంతో నిర్మానుష్యంగా మారాయి. సిజిమాలి బాకై ్సట్‌ నిక్షేపాలను తవ్వుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేదంత కంపెనీకి అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో బాకై ్సట్‌ను తవ్వి తరలించేందుకు వీలుగా సగుబారి నుంచి సిజిమాల్‌ బాకై ్సట్‌ కొండల వరకు కంపెనీ రహదారి నిర్మిస్తున్న సమయంలో అడ్డుకున్న బాధిత గ్రామాల ప్రజలు పోలీసులపై రాళ్లురువ్వడంతో 58 మంది వరకు పోలీసులు గాయాలపాలైన సంగతి తెలిసిందే. పోలీసులను గాయపరచడంతో ఎప్పుడు ఏ పరిస్థితి సంభవిస్తుందో అన్న భయంతో గ్రామస్తులు తమ ఇళ్లకు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. సమితిలోని కంటామల్‌ గ్రామంలో సుభాషిన్‌ మాఝి అనే వ్యక్తిపై 14 కేసులు ఉండటంతో అమెను అరెస్టు చేసేందుకు పోలీసులు సోమవారం రాత్రి బలగాలతో చేరుకున్నారు. సుభాషిన్‌ మాఝిని అరెస్టు చేసందుకు సన్నహాలు చేశారు. అప్పటికే గ్రామస్తులను పోలీసులు బెదించడంతోపాటు కొంతమంది గ్రామస్తులను గాయపరిచారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడి నుండి పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. మరుచటి రోజు మంగళవారం పూర్తి పోలీస్‌ బందోబస్తుతో సగుబారి రహదారిని వేసేలా కంపెనీకి అండగా నిలిచారు. ఆది నుంచి తమ ప్రాంతంలో బాకై ్సట్‌ నిక్షేపాలను తవ్వద్దని, దీని వల్ల పర్యావరణం నష్టమవ్వడంతోపాటు అడవి తల్లినే నమ్ముకుని ఉన్న ఆదివాసీల జీవనోపాధి కోల్పోతారని అంతా వ్యతిరేకించారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు మరణాయుధాలతో ప్రతిఘటించారు. దీంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌ను విడుదల చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలసులపై గ్రామస్తులు రాళ్లు రవ్వడంతో 58 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు దక్షిణాంచల్‌ డీఐజీ చరణ్‌ సింగ్‌ మీనా కాసీపూర్‌లో మంగళవారం పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement