రంగస్థలం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రంగస్థలం సిద్ధం

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

నేటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి బాపూజీ కళామందిర్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బాపూజీ కళామందిర్‌ వద్ద ఏర్పాట్లు చేశారు.

● రాత్రి 7 గంటలకు శివశ్రీ నృత్య కళానికేతన్‌ విద్యార్థుల నృత్య ప్రదర్శన.

● 7.30 గంటలకు హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ‘సీ్త్ర మాత్రే నమః’ నాటిక ప్రదర్శన.

● 9 గంటలకు పెందుర్తికి చెందిన నటరాజ డ్రమోటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘నీళ్లు– నీళు’ సాంఘిక నాటిక.

● 11న 7గంటలకు విశాఖపట్నం వారికి చెందిన తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ‘చిటికెన వేలు’ నాటిక.

● 8.30 గంటలకు విజయవాడకు చెందిన శ్రీకృష్ణ తెలుగు థియేటర్‌ ఆర్ట్స్‌’ ఆధ్వర్యంలో ‘మరో పుత్తడి బొమ్మ’ నాటిక.

● 12న 6గంటలకు ఎల్‌.రామలింగస్వామికి జీవితి సాఫల్య పురస్కార సభ.

● 7.30 గంటలకు కాకినాడకు చెందిన బీవీ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ‘కన్నీటికి విలువెంత’ నాటిక ప్రదర్శిస్తారు.

● 9గంటలకు విజయవాడకు చెందిన హర్ష క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు పోటీలు ప్రదర్శిస్తారు. ఆనంతరం ముగింపు సభ, బహుమతి ప్రధానోత్సవం ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement