మూల విరాట్లకు శుద్ధిస్నానం | - | Sakshi
Sakshi News home page

మూల విరాట్లకు శుద్ధిస్నానం

Mar 14 2026 8:01 AM | Updated on Mar 14 2026 8:01 AM

భువనేశ్వర్‌: పూరీ శ్రీమందిరం రత్న వేదికపై కొలువుదీరిన బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుడు మరియు సుదర్శనునికి శుక్రవారం మధ్యాహ్నం శుద్ధి స్నానం చేయడం అనివా ర్యం అయింది. ప్రధాన ఆలయం కొలొహట్టొ ద్వారం ఆవరణలో ప్రమాదవశాత్తు మోపరి (బొఝియా) సేవకుని తల పగిలి రక్తపు బొట్టు రాలింది. ఈ నేపథ్యంలో రత్న వేదికపై చున్నను నీరు చిమ్మి శుద్ధి చేసి మూల విరాటులకు మహా స్నానం చేయించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనం నిలిపివేశారు.

జగన్నాథ మందిర హుండీ ఆదాయం లెక్కింపు

రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ జగన్నాథ మందిరంలోని హుండీలో భక్తులు సమర్పించిన కానుకుల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. పట్టణ ప్రముఖులు, తహసీల్దార్‌, కమిటీ సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. 44,110 రూపాయలు లభించినట్లు కమిటీ సభ్యుడు గుడ్ల ప్రసాదరావు తెలిపారు. ఈ మొత్తాన్ని మందిరం కమిటీ పేరిట బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామన్నారు.

యువతిని మోసగించిన యువకుని అరెస్టు

జయపురం: ప్రేమించానన్నాడు.. శారీరకంగా దగ్గరయ్యాడు.. గర్భం దాల్చాక పెళ్లిచేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా వారు యువకుడిని అరెస్టు చేశారు. ఆ యువకుడితో పాటు అతడి తల్లి, తండ్రి, అతడి సోదరి కూడా తనను చంపుతామని హెచ్చరించారని ఆ యువతి పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. జయపురం పోలీసులు ఆ యువకునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు మహిళా పోలీసు అధికారి వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు.. నిందితుడు నవరంగపూర్‌ సదర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి బిరగుడ గ్రామం జొగా మఝి(21)జయపురం సదర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉంటున్న 18 యువతితో సోషల్‌ మీడియా మాధ్యమంగా పరిచయం పెంచుకున్నాడు. ఒక రోజు ఆ యువకుడు ఆ యువతి గ్రామానికి వచ్చి అలా తిరిగి వద్దాం రమ్మని పిలిచాడు. ఆమెను ఒక లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడి జరిపాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఆ యువకుడు ఏదో మందు ఇచ్చి ఆమె గర్భాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించాడు. మందు తినేందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో యువతిపై దాడి చేశాడు. అనంతరం నవరంగపూర్‌, తర్వాత జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లాడు. అయినా ఆమె పట్టువిడవ లేదు. దీంతో యువకుని కుటుంబ సభ్యులు ఆమెను కొడుతూ చంపుతామని హెచ్చరించారు. ఆఖరికి బాదిత యువతి నిరాశ చెంది 2025 నవంబర్‌ 30 వ తేదీన జయపురం మహిళా పోలీసు స్టేషన్‌ పోలీసు అధికారిని ఆశ్రయిందని వెల్లడించారు. ఆమె ఇచ్చిన ఫిర్యా దుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని నిందితుడు పరారై గురువారం దొరికాడని జయపురం మహిళా పోలీసు అధికారి ఆశ్రిత లక్రో వెల్లడించారు.

ప్రయాణికుడిపై దాడి కేసులో ఇద్దరు అరెస్టు

రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద ఒక ప్రయాణికుడిపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను సదరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో స్థానిక కస్తూరీ నగర్‌కు చెందిన జి.అజయ్‌, నెహ్రూనగర్‌కు చెందిన సతీష్‌ కుమార్‌లు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్‌డీపీవో గౌరహరి శుక్రవారం సాయంత్రం సదరు పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గురువారం రాత్రి రైల్వేస్టేషన్‌ వద్ద బలరాం పరిడ అనే ప్రయాణికుడిపై ఇద్దరు వ్యక్తులు దాడిచేసి అతని వద్దనున్న పర్సు, నగదు దోపిడీ చేశారు. దీనిపై బాధితుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోపే నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు ఏటీఎం కార్డులు, ఒక సెల్‌ఫోన్‌, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, ఒక స్కూటీతో పాటు దాడికి వినియోగించిన అల్యూమినియం పైపును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరైస్టెన నిందితులపై గతంలో ఇటువంటి తరహా కేసులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్‌డీపీవో వెల్లడించారు. అనంతరం నిందితులను కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement