వందేమాతరంపై శిక్షణ
జయపురం: జయపురం బాబా సాహేబ్ కల్యాణ మండపంలో 6 జిల్లాల ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు వందే మాతరం శిక్షణ శిబిరం గురువారం నిర్వహించారు. కొరాపుట్ జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన వందేమాతరం శిక్షణ శిబిరంలో కొరాపుట్, రాయగడ, మల్కనగిరి, నవరంగపూర్ కలహండి, నువాపడ జిల్లాల్లోని ప్రతీ సమితి నుంచి, మునిసిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్‌ల నుంచి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయిరాళ్లు, ఉపాధ్యాయుడు, ఒక అధ్యాపకుడు చొప్పున పాల్గొని శిక్షణ పొందారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు సమితుల్లో, మునిసిపాలిటీల్లో, నోటిఫైడ్ ఏరియా ప్రాంతాల్లో వందేమాతరంపై శిక్షణ ఇస్తారని నిర్వాహకులు వెల్లడించారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో దేశమంలో, రాష్ట్రంలో ప్రజల ఐక్యత, దేశ ప్రేమ, బలిదానంపై యువకులలో సచేతలను చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వందేమాతర సంగీతం, మొదలగు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులతో సత్కరిస్తారు. ఈ శిక్షణ శిబిరంలో సంగీతంపై అధిక జ్ఞానం, వందేమాతరం గీతం పాడే విధానం శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరం నిర్వహణకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 9 మంది జిల్లా స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేశారు.


