ఫిబ్రవరి 1న ఖుర్దా రోడ్ హాఫ్ మారథాన్
రిజిస్ట్రేషన్ వివరాలు
● 21.1 కిలోమీటర్లు హాఫ్ మారథాన్ రూ. 699
● 10 కిలోమీటర్లు పరుగు రూ. 599
● 5 కిలోమీటర్లు ఫన్ రన్ రూ. 499
● 2 కిలోమీటర్లు ఫ్యామిలీ రన్ రూ. 399
భువనేశ్వర్: రెండో విడత ఖుర్దా రోడ్ హాఫ్ మారథాన్ భువనేశ్వర్–2026 కొత్త సంవత్సరం ఫిబ్రవరి 1న జరుగుతుంది. ఔత్సాహిక అభ్యర్థులు జనవరి 15వ తేదీ లోగా అనుబంధ వివరాలు నమోదు చేసుకోవాలని ఖుర్దా రోడ్ మండలం రైల్వే అధికారి (డీఆర్‌ఎమ్) అలోక్ త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీని ఐఐటీ భువనేశ్వర్ సహకారంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్సు అసోసియేషన్ (ఈకోర్సా) నిర్వహిస్తుందన్నారు. ఈ క్రీడా కార్యక్రమం పౌరులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రేరేపించి శారీరక దృఢత్వానికి దోహదపడుతుందన్నారు.
ఈ మారథాన్ 21.1 కిలో మీటర్లు హాఫ్ మారథాన్, 10 కిలో మీటర్లు పరుగు, 5 కిలో మీటర్లు ఫన్ రన్, 2 కిలో మీటర్లు కుటుంబ పరుగు 4 వర్గాల కింద నిర్వహిస్తారు. ఈ పరుగులో 8 సంవత్సరాల పైబడిన ఆబాలగోపాలం పాల్గొన వచ్చని తెలిపారు. 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు విభాగాలలో (పురుషులు మరియు సీ్త్రలు) విజేతలకు మొత్తం రూ. 2.32 లక్షల నగదు బహుమతి అందిస్తారు. ఈ కార్యక్రమం ఖుర్దా రోడ్‌లోని ఈకోర్సా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమై ముగుస్తుంది. ఐఐటీ భువనేశ్వర్ గుండా బెర్హంపురా వద్ద మలుపు తిరిగి స్టేడియంకు చేరడంతో మారథన్ ముగుస్తుందని వివరించారు.
ఈ సమావేశంలో సీనియర్ మండల వాణిజ్య అధికారి, ఖుర్దా రోడ్ మండలం క్రీడాధికారి అనిల్ కుమార్ ఎస్ మరియు మండల యాంత్రిక ఇంజినీర్ (కోచింగ్) మరియు సహాయ క్రీడాధికారి మనీష్ కుమార్ మీనా పాల్గొన్నారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ – khurdasoadhafmarathon.comని సందర్శించవచ్చు లేదా నిర్వాహకులను 8455887959 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.


