ఇంధనం కోసం కాలుష్య ఽధ్రువీకరణ పత్రం వాయిదా
భువనేశ్వర్: వాహనాలకు కాలుష్య ధ్రువీకరణ పత్రం లేకుంటే అవసరమైన పెట్రోలు, డీజిల్ పంపిణీ నిలిపి వేయడం జరగుతందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన కట్టుదిట్టంగా అమలు చేస్తామని రాష్ట్ర వాణిజ్య, రవాణా విభాగం ప్రకటించింది. దీంతో వాహనదారులు కాలుష్య ధృవ పత్రాల కోసం ఎగబాకడంతో పలు చోట్ల అవాంఛనీయ పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా కాలుష్య ధ్రువీకరణ పత్రాలతో ఇంధన సరఫరా నిబంధన అమలు నిరవధికంగా నెల రోజులపాటు వాయిదా వేసినట్లు విభాగం మంత్రి బిభూతి భూషణ్ జెనా బుధవారం ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకు కొత్త నిబంధన నిరవధికంగా వాయిదా పడింది. అంత వరకు పెట్రోలు, డీజిల్ వంటి వాహన ఇంధన వినియోగదారులకు ఇబ్బంది కలిగించరాదని మంత్రి హితవు పలికారు. నెల రోజులు గడువు ముగిసే లోగా వాహన వినియోగదారులు రవాణా చట్టం నిబంధనల మేరకు వాహన సంబంధిత కాగితపత్రాలు, ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకుని చట్టపరమైన చర్యలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలని కోరారు.
కుష్టు రోగులకు దుప్పట్ల పంపిణీ
పర్లాకిమిడి: క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక డోలా ట్యాంకు రోడ్డు మహారాజా డైమండ్ జుబిలీ కుష్టురోగుల పునరావాస కేంద్రంలో ఉంటున్న రోగులకు ఒకటో నంబరు కౌన్సిలరు అలిజింగి అమ్ములమ్మ బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. కుష్టు రోగుల పునరావాసంలో ఉంటున్న 15 మంది రోగులకు ఈ దుప్పట్లు పంపిణీ చేశారు.
రాయగడ: రాయగడ అటవీ శాఖ, కలహండి జిల్లా అటవీ శాఖ అధికారులు బుధవారం నిర్వహించిన సంయుక్త దాడుల్లో రెండుపులి చర్మాలు స్వాఽధీనం చేసుకుని అందుకు సంబంధించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. జిల్లాలొని కాశీపూర్‌లోని హనుమాన్ మందిరం సమీపంలో పులి చర్మాలు విక్రయిస్తుండగా నిందితులను అధికారులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కాశీపూర్ సమితి సుంగేరు గ్రామానికి చెందిన గోపి గౌడొ, గుప్తేశ్వర్ గౌడొ అమర్‌సింగ్‌గుడ గ్రామానికి చెందిన ఈశ్వర్ నాయక్, పుడుగొసిల్ గ్రామానికి చెందిన సువార్‌సింగ్ మాఝి, కొడికిపొదొరా గ్రామానికి చెందిన కాలు మాఝిలు ఉన్నారు. నిందితుల నుంచి పులి చర్మాలతో పాటు మూడు బైకులు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఇంధనం కోసం కాలుష్య ఽధ్రువీకరణ పత్రం వాయిదా


