పౌర రక్షణ
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
విపత్తు నిర్వహణ..
భువనేశ్వర్: అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో సన్నద్ధత, సమన్వయం, ప్రభావవంతమైన ప్రతిస్పందనను ప్రదర్శించే లక్ష్యంతో.. తూర్పు కోస్తా రైల్వే వివిధ విభాగాల నుంచి 59 మంది పౌర రక్షణ వలంటీర్ల చురుకై న భాగస్వామ్యంతో తూర్పు కోస్ట్ రైల్వే బుధవారం సమగ్ర పౌర రక్షణ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పౌర రక్షణ వలంటీర్ల అంకితభావం, క్రమశిక్షణ, వృత్తిపరమైన సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఊహించని పరిస్థితుల వంటి అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను, ఆస్తిని రక్షించడంలో పౌర రక్షణ దళాలు పోషించిన కీలక పాత్రను కొనియాడారు. విపత్తు సన్నద్ధత, ప్రతిస్పందన విధానాలను మరింత బలోపేతం చేయడానికి నిరంతర శిక్షణ, మాక్ డ్రిల్స్ మరియు ప్రజా అవగాహన కార్యక్రమాలలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. ఈ ప్రదర్శనలో తేలికపాటి, భారీ సహాయక చర్యలు, ప్రథమ చికిత్స పద్ధతుల అవలంబన ప్రదర్శించారు. వీటిలో వివిధ ప్రమాదకర తరలింపు పద్ధతులు, నిచ్చెన, తాడు రక్షణ, స్ట్రెచర్ ఆపరేషన్లు, రాపెల్లింగ్, వాల్ క్రాలింగ్, ప్రమాద డ్రాగింగ్ మెలకువలు, విద్యుత్ షాక్ నిర్వహణ, ఫైర్‌మ్యాన్ లిఫ్ట్, ప్రత్యక్ష అగ్నిమాపక నిర్వహణ విన్యాసాలు ప్రదర్శించారు.
పౌర రక్షణ
పౌర రక్షణ
పౌర రక్షణ


