యువ క్రీడాకారిణి జ్యోత్స్నకు ప్రధానమంత్రి జాతీయ శిశు పు
పర్లాకిమిడి: ప్రధానమంత్రి జాతీయ శిశు పురస్కార్ అవార్డుకు గజపతి జిల్లా రాయగడ బ్లాక్ విద్యార్థిని, యువ వెయిట్ లిఫ్టర్ జ్యోత్స్న శోబోరో ఎంపికై ంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం కలెక్టర్ మునీంద్ర హానగ ప్రత్యేక అభినందన సభను ఏర్పాటుచేశారు. రాయగడ బ్లాక్ మర్లబ పంచాయతీ మారుమూల గ్రామానికి చెందిన పెక్కటో గ్రామానికి చెందిన జ్యోత్స్న శోబోరో ప్రస్తుతం భువనేశ్వర్‌లోని కిట్ విశ్వవిద్యాలయంలో సోషల్ సైన్సులో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. గతంలో ఖేలో ఇండియా, ఆసియన్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో 2019 రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకుంది. ఈ నెల 26న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా జాతీయ శిశు పురస్కారం అందుకోనున్నట్టు జిల్లా కలెక్టర్ మునీంద్ర హానగ తెలియజేశారు. జ్యోత్స్న శోబోరోకు భవిష్యత్‌లో జిల్లా యంత్రాంగం క్రీడారంగంలో పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. గజపతి జిల్లాకు క్రీడారంగంలో వన్నెతెచ్చిన శోబోరో తండ్రి కీర్తన్ శోబోరో ఒక గిరిజన రైతు. ఆమెను న్యూ ఢిల్లీకి ప్రభుత్వ ఖర్చుతో ఈరోజు సాయంత్రం ఫ్‌లైట్‌లో పంపించనున్నారు. క్రీడాకారిణి జ్యోత్సన శోబోరోతో ఆమె తండ్రి కీర్తన్ శోబోరో, మామయ్య ఎస్కార్ట్‌గా వెళ్లనున్నట్లు డీసీపీయూ అరుణ్‌కుమార్ త్రిపాఠి తెలియజేశారు. ఆమెకు జిల్లా స్పోర్ట్స్, సబ్ కలెక్టర అనుప్‌పండా పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.
యువ క్రీడాకారిణి జ్యోత్స్నకు ప్రధానమంత్రి జాతీయ శిశు పు


