శబరి క్షేత్రంలో పీసీసీ చీఫ్ భక్తచరణ్‌దాస్ పూజలు
● శబరి శ్రీక్షేత్రంలో పీసీసీ చీఫ్ భక్తచరణ్ దాస్
కొరాపుట్: రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ శబరి శ్రీక్షేత్రాన్ని దర్శించుకున్నారు. బుధవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని శబరి క్షేత్రంలో జగన్నాథ, శుభద్ర, బలభద్రలకు ప్రత్యేక పూజలు చేశారు.పీసీసీ చీఫ్‌కు కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రుపక్ తురుక్, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్, ఎంపీ ప్రతినిధి మనోజ్ ఆచార్య తదితరులు స్వాగతం పలికారు.
భక్తిశ్రద్ధలతో
గోదాతాండవ పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని రోజూ నిర్వహిస్తున్న పూజల్లో భాగంగా బుధవారం గోదా తాండవ, కృష్ణుల పూజలను భక్తి శ్రద్ధలతవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. ఉదయం స్వామి వారికి సుప్రభాత పూజలతో పాటు అభిషేకాలు, కుంకుమార్చనలు జరిగాయి. అలాగే తొమ్మిదో పాశురం విన్నపం పూజలను చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నగరంలో నకిలీ పోలీసుల అరెస్టు
భువనేశ్వర్: స్థానిక ఖండగిరి ఠాణా పోలీసులు ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్టు చేశారు. పోలీసుల వలె నటిస్తూ ఖండగిరి ప్రాంతంలో దోపిడీకి పాల్పడ్డారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. వారిలో ఒక నిందితుడు కేరళకు చెందినవాడు కాగా మరొకరు ఖండగిరి ప్రాంతానికి చెందిన వాడుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు.
స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై
శిక్షణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒక రోజు పాటు నిర్వహించిన జిల్లా స్థాయి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు–2030(ఎస్ డి జి–2030) శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమానికి అదనపు జిల్లా కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖలు అమలు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు దీర్ఘకాలికంగా అమలు చేస్తే అభివృద్ధి లక్ష్యాలు సాధించగలమని అన్నారు. కార్యక్రమంలో బలిమెల కౌన్సిల్ చైర్మన్ ప్రదిప్ నాయక్, గోలక్‌చంధ్ర దోలాయ్, సరోజ్ కుమార్ దాస్, హిమాంశు భూషణ్ మహారాణా ఇతరులు పాల్గొన్నారు.
శబరి క్షేత్రంలో పీసీసీ చీఫ్ భక్తచరణ్‌దాస్ పూజలు
శబరి క్షేత్రంలో పీసీసీ చీఫ్ భక్తచరణ్‌దాస్ పూజలు


