రూర్కెలాలో బినోదినీ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం
పర్లాకిమిడి: ఒడిశాలోని రూర్కెలా ఉన్న హైటెక్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో బుధవారం బినోదినీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను ఢెంకనాల్ ఎమ్మెల్యే, స్టాడింగ్ కమిటీ సభ్యులు, బిభూతీ భూషన్ ప్రధాన్ ప్రారంభోత్సవం చేశారు. ఈస్ట్రన్ ఒడిషాలో తొలి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్ స్కానర్ సదుపాయం కూడా ఉందని చైర్మన్ (హైటెక్ మెడికల్ ఇనిస్టిట్యూట్స్) డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలియజేశారు. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష పాణిగ్రాహి, ఫుల్భానీ ఎమ్మెల్యే ఉమాచరణ్ మల్లిక్, తదితరులు పాల్గొన్నారు.
రూర్కెలాలో బినోదినీ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం


