చొయితీ ఉత్సవాలకు రంగం సిద్ధం
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జిల్లాస్థాయి చొయితీ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పల్లెను తలపించే విధంగా వేదికను రూపొందించారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అభివృద్ధికి సంబంధించి ప్రదర్శనను ఏర్పాటు చేసే స్టాళ్లను సిద్ధం చేశారు. ఐదు రోజులు జరిగే ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక మజ్జిగౌరి మందిరం నుంచి కలశ యాత్రను నిర్వహించి వేదకి వద్దకు వెళతారు. అక్కడ జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి గొకులా నంద మల్లిక్ హాజరవుతారు. అలాగే గౌరవ అతిథిగా కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక, గుణుపూర్ ఎంఎల్‌ఏ సత్యతీజ్ గొమాంగో, బిసంకటక్ ఎంఎల్‌ఏ నీలమాధవ హికక లు హాజరవుతారని జిల్లా కలెక్టర్ ,ఉత్సవ కమిటీ అధ్యక్షులు అశుతోష్ కులకర్ణి తెలిపారు.
ఉత్సవాలను విజయవంతం చేయాలి:
కలెక్టర్ వీడియో సందేశం
ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు కొనసాగే చొయితీ జిల్లా స్థాయి ఉత్సవాలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందరి సహాయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా ఉత్సవాలు విజయవంతమవ్వాలంటే అందరి సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
చొయితీ ఉత్సవాలకు రంగం సిద్ధం
చొయితీ ఉత్సవాలకు రంగం సిద్ధం


