రామచంద్ర ఉలక విగ్రహావిష్కరణ
● ఆలస్యంగా వచ్చిన మంత్రి
బిభూతి జెన్న
రాయగడ: రాష్ట్ర మాజీమంత్రి, స్వర్గీయ రామచంద్ర ఉలక విగ్రహావిష్కరణకు రాష్ట్ర గనులు, రవాణా శాఖల మంత్రి బిభూతి జెన్న సకాలంలో హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసి విగ్రహావిష్కరణకు పూనుకున్నారు. విగ్రహం ఆవిష్కరించి శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ నాయ కులు అక్కడ నుంచి బహిరంగ సభ జరిగే తేజస్వీ మైదానానికి తిరిగి వెళ్లారు. ఆలస్యమైనప్పటికీ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలానికి వచ్చిన మంత్రి విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తవ్వడంతో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి తిరిగి వెళ్లారు. కొరాపుట్ లోక్‌సభ ఎంపీ సప్తగిరి ఉలకకు స్వయా న తండ్రి అయిన స్వర్గీయ రామచంద్ర ఉలక విగ్రహం ఏర్పాటుకు ఆదినుంచీ అవాంతరాలు ఏర్పడ్డాయి. ముందుగా స్థానిక గజపతి కూడలి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంపీ సప్తగిరి అన్ని సన్నాహాలు చేశారు. అనంతరం విగ్రహాన్ని కూడా అక్కడ నెలకొల్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 24న ఉన్నట్లు ఖరారు చేశారు. అందుకు స్థానిక బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం స్పందించి విగ్రహాన్ని స్థానిక వోఎంపీ సమీపంలోని ముక్తా పార్క్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బుధవారం ముక్తా పార్క్‌లో విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలొ సప్తగిరి ఉలక కాంగ్రెస్ నాయకులైన భక్త చరణ్ దాస్, ప్రసాద్ హరిచందన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భుపేష్ భగేల్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సాధారణ కార్యదర్శి అజయ్‌కుమార్‌ను ఆహ్వానించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సమయం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనులు, రవాణా శాఖల మంత్రి బిభూతి జెన్న కూడా హాజరవ్వాల్సి ఉండేది. బ్యాంక్ కాలనీ నుంచి విగ్రహావిష్కరణ వేదిక వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్లి చేరుకున్నారు. అయితే కార్యక్రమానికి మంత్రి జెన్న కూడా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సకాలంలో మంత్రి హాజరుకాలేదు. సుమారు 15 నిమిషాలు మంత్రి కోసం వేచి ఉన్న కాంగ్రెస్ నాయకులు సహనం కొల్లోయారు. సకాలంలో హాజరుకావల్సింది పోయి మంత్రి తమ పార్టీ కార్యకర్తల వల్లే తమను ఇలా వేచిఉండేట్టు చేయడం ఏమాత్ర ఆమోదయోగ్యం కాదని మండిపడిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణిపై మండిపడ్డారు. అనంతరం కాంగ్రెస్ నాయకులంతా కలిసి స్వర్గీయ రామచంద్ర ఉలక విగ్రహాన్ని ఆవిష్కరించి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత మంత్రి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన్పప్పటికీ అప్పటికే విగ్రహం ఆవిష్కరించి ఉండటం చూసి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్య క్రమంలో రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు కూడా పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
రామచంద్ర ఉలక విగ్రహావిష్కరణ


