వీరనారాయణపూర్‌లో సేవా కార్యక్రమాలు
రాయగడ: సదరు సమితి కొత్తపేట పంచాయతీలోని వీరనారాయణపూర్ యూపీ స్కూల్‌లో స్థానిక లయన్స్ అపరాజిత క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. గ్రామానికి చెందిన 90 మంది వృద్ధ మహిళలకు రగ్గులు, ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. శీతాకాలం కావడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పేదలు ఇబ్బంది పడతారని భావించిన క్లబ్ సభ్యులు ఈ మేరకు సేవా కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో లయన్స్ అశ్విని దాస్, వి.భాస్కరావు, సత్యవాది పతి, టి.జయరాం, జి.రామక్రిష్ణ, రజిత కొరాడ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తామని ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు తెలియజేశారు.
వీరనారాయణపూర్‌లో సేవా కార్యక్రమాలు


