
10 కేజీల గంజాయి స్వాధీనం
● ఒకరు అరెస్టు
జయపురం: జయపురం రైల్వే స్టేషన్‌లో 10 కేజీల గంజాయిని కొరాపుట్ రైల్వే పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు జరుపుతుండగా ఓ వ్యక్తి బస్తాతో నిలిచి ఉండటంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆ బస్తాలో గంజాయి ఉండటంతో ఆ వ్యక్తి అరెస్టు చేశారు. గంజాయి 10 కేజీలు ఉన్నట్ల రైల్వే పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. లక్ష ఉంటుందన్నారు. అరెస్టు అయిన వ్యక్తి శ్యామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు కోసం బస్తాతో నిరీక్షిస్తున్నాడని, అతడు జయపురం నుంచి రాయగడ వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ మీదుగా పంజాబ్ వెళ్లనున్నట్లు వెల్లడించారు. అరెస్టు అయిన వ్యక్తి పంజాబ్ రాష్ట్ర లుథియాన ప్రాంతం అసమాన్(25) అని జీఆర్పీ అధికారి సంతోష్ మహంత వెల్లడించారు. ఈ సంఘటనపై కొరాపుట్ జీఆర్పీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎక్కడ నుంచి గంజాయి తీసుకు వస్తున్నాడు, ఎక్కడ అమ్ముతున్నాడనే విషయాలపై దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించారు. తనిఖీలు నిర్వహించిన వారిలో సబ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణహంతి, జి.గణేష్, తదితరులు ఉన్నారు.