
సైబర్ వలలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి
రాయగడ: సైబర్ మోసాల వలలో ఒక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి చిక్కుకున్నారు. స్థానిక ఇందిరానగర్ మూడో లైన్‌లో నివసిస్తున్న ప్రజారోగ్య శాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగి పూర్ణ చంద్ర త్రిపాఠి ఖాతా నుంచి రూ.1.24 లక్షలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. ఈ మేరకు బాధితుడు స్థానిక సైబర్ సెల్‌ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం బాధితుడి వమొబైల్‌కు వచ్చి సందేశాన్ని తెరచి చూస్తే.. తన ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.1.24 లక్షలు డెబిట్ అయినట్లు ఉంది. అనంతరం అతడు బ్యాంకు అధికారులకు సంప్రదించగా సైబర్ నేరగాళ్లు ఖాతా నుంచి డబ్బులు కాజేశారని తెలిపారు. అనంతరం తాత్కాలికంగా అతని బ్యాంకు ఖాతాను మూసివేశారు. కేసు నమోదు చేసిన సైబర్ పోలీస్ విభాగం ఈ మేరకు దర్యాప్తు చేస్తుంది.