
ఘాటీలో కమాండర్ జీపు బోల్తా
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా బాయపోడ ఘాటీలో గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఓ కమాండర్ జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. సాధారణంగా జీపులో 15 మంది మాత్రమే ప్రయాణించాలి. కానీ 25 మంది ప్రయాణిస్తున్నారు. కోరుకొండ సమితి నక్కమామ్ముడి పంచాయతీ ఆమలిబేడ గ్రామస్తులంతా కలిసి కుడుములగుమ్మ వద్ద జరుగుతున్న వారపు సంతకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న వారు చూసి కుడుములగుమ్మ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. వారిని ముందు కుడుములగుమ్మ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మల్కన్‌గిరి ఆస్పత్రికి పంపించారు. బలిమెల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

ఘాటీలో కమాండర్ జీపు బోల్తా