
● సత్యం, అహింస, కరుణతో సుసంపన్న సమాజం సాధ్యం ● స్మారకోత
భువనేశ్వర్ : మహాత్మాగాంధీ అనుసరించిన సత్యం, అహింస, కరుణను ఆదర్శంగా స్వీకరించి నైతిక పద్ధతుల్లో సుసంపన్న సమ్మిళిత సమాజాన్ని నిర్మి ద్దామని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపా టి ప్రజలకు పిలుపునిచ్చారు. కటక్ నువా బజారు ప్రాంతంలో ఆసియాలోనే అతి పెద్ద కుష్టు ఆశ్రమా నికి గాంధీ చేపట్టిన పాదయాత్రకు శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో బుధవారం స్మారక కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆశ్రమం కేవలం చికిత్సకు కేంద్రం మాత్రమే కాదని, వైద్యం, ఆశ, మానవ గౌరవానికి నిలయమని పేర్కొన్నారు. వైజ్ఞానికత, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంతో భారత దేశం ముందుకు సాగుతున్న తరుణంలో మౌలిక మానవ విలువల పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. యుద్ధాలు, విభజనలు విచ్ఛిన్నతలు కాకుండా సరళత, కరుణ, అహింసతో జీవించడాన్ని గాంధీజీ నుంచి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వందేళ్ల కిందట 1925లో మహాత్ముడు కుష్టు ఆశ్రమానికి చేపట్టిన పాదయాత్రను నైతిక తీర్థ యాత్రగా అభివర్ణించా రు. కుష్టు రోగులను అవమానించి, వారిని అణగ దొక్కే సమయంలో గాంధీ వారి పట్ల సానుభూతి, గౌరవంతో ముందడుగు వేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం సమాజాంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్, ఇతర బాధితులను వివక్షతో చూడటం మానుకోవాలన్నా రు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో గవర్నర్ మ హాత్మా కుష్టు సేవా స్మృతి వనం ప్రారంభించారు.
●రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మాట్లాడుతూ ప్రభు త్వం కుష్టు రోగులకు ఆధునిక చికిత్సతో కృత్రిమ అవయవాలు, పునరావాసం సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కటక్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ భర్తృ హరి మహతాబ్ మాట్లాడుతూ స్వేచ్ఛ అందరికీ ఒక టేనన్నారు. దళితులు, అణచివేతకు గురైనవారు, అణగారిన వర్గాలకు సమాన స్వేచ్ఛను అందించాలనేది మహాత్ముని కల అని చెప్పారు. కార్యక్రమంలో కటక్ నగర పాలక సంస్థ (సీఎంసీ) మేయర్ సుభాష్ చంద్ర సింగ్, చౌద్వార్ కటక్ ఎమ్మెల్యే సౌవిక్ బిస్వాల్, కటక్ సదర్ ఎమ్మెల్యే, ఇంజినీర్ ప్రకాష్ చంద్ర సెఠి, కటక్ జిల్లా మేజిస్ట్రేట్ దత్తాత్రేయ భౌసాహెబ్ షిండే, కటక్ నగర పాలక సంస్థ (సీఎంసీ) కమిషనర్ కిరణ్‌దీప్ కౌర్, నయన్ కిషోర్ మహంతి పాల్గొన్నారు.

● సత్యం, అహింస, కరుణతో సుసంపన్న సమాజం సాధ్యం ● స్మారకోత

● సత్యం, అహింస, కరుణతో సుసంపన్న సమాజం సాధ్యం ● స్మారకోత