
రెండు ప్రైవేట్ చిల్డ్రన్ హోమ్స్ రద్దు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గుసాని సమితిలో ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ చిల్డ్రన్ హోస్టల్స్, హోమ్స్‌ను జిల్లా కలెక్టర్ ముధుమిత నిషేధిస్తూ బుధవారం ఉత్తరు్‌ువ్ల జారీ చేశారు. జిల్లా అధికారుల బృందం బాలల సంక్షేమ కమిటీ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మాయాధర్ సాహు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ గుసాని సమితి బి.సీతాపురంలో గుడ్ న్యూస్ ఇండియా అలియాస్ డ్రీమ్ సెంటర్, అంబాజరి మెట్టు గ్రామంలో న్యూ హోప్ చిల్డ్రన్ హోమ్‌ను సందర్శించి హోస్టల్ ఓనర్‌షిప్ కాగితాలు లేనందున రెండింటిపై చర్యలు తీసుకున్నారు. ఈ రెండు హోస్టళ్లలో 68 బాలబాలికలు ఉన్నారు. వీరిని పునరావాసం కింద ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బాలికల వసతి, కస్తూర్బా గాంధీ సంక్షేమ హోస్టల్, అర్బన్ ఎస్సీ, ఎస్టీ హోస్టల్ (పర్లాకిమిడి), ఉత్కల్ బాలాశ్రమానికి తరలించారు. దీనిపై జిల్లా బాలల సంరక్షణ అధికా రి (డి.సి.పి.యు.) అరుణ్‌కుమార్ త్రిపాఠి విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో గుసాని సమితిలో రెండు నిషేధిత బాలల హోస్టల్స్‌పై నిషేధించడమే కాకుండా ఇంకెక్కడైనా ఇలా ప్రభుత్వ అనుమతి లేని బాలబాలికల వసతులు వుంటే వాటిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

రెండు ప్రైవేట్ చిల్డ్రన్ హోమ్స్ రద్దు