
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన
పర్లాకిమిడి: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గజపతి జిల్లా కాశీనగర్ సమితిలో కింగ గ్రామం జలదిగ్భంధంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా బుధవారం పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కాశీనగర్ ప్రాంతంలో వరద ప్రాంతాలలో పర్యటించి రైతులు, ప్రజల సమస్యలను విన్నారు. భారీగా పంట నష్టం వాటల్లినందున తమను ఆదుకోవాలని కింగ గ్రామస్తులు విన్నవించారు. కాశీనగర్ – కింగ గ్రామానికి అనుసంధానమైన పాత వంతెన ఎత్తును పెంచాలని విజ్ఞప్తి చేశారు. గుమ్మ గెడ్డతో వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, సమస్య పరిష్కరించాలని కోరారు. అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు
జయపురం: అక్రమంగా నాటు సారా అమ్మేందుకు తీసుకెళ్తున్న ఒక మహిళతో పాటు మరొకరిని వేర్వేరు ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు జయపురం అబ్కారి విభాగ అధికారి సుభ్రతా కేశరి హిరన్ బుధవారం తెలిపారు.అరెస్టు అయిన వారు జయపురం సమితి బర్లాహండి గ్రామానికి చెందిన దుర్జోధన బిశాయి, రాణిపుట్ ప్రాంతానికి చెందిన మహిళ ఉన్నారన్నారు. ఇద్దరిపైన కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. తాము మంగళవారం తమ సిబ్బందితో జయపురం సమితిలోని పలు ప్రాంతాలలో పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో రొండాపల్లి ప్రాంతాలలో సారాను విక్రయించేందుకు తీసుకొని వెళ్తుండగా ఇద్దరు పట్టుబడినట్టు పేర్కొన్నారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన చందిలి పొలీస్ స్టేషన్ పరిధిలోని అమలాభట్ట సమీపంలో బుధవారం చోటుచేసుకోగా.. బుటి సంతొష్, సురేష్ కులిసికలు గాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మునిగుడ నుంచి బైకుపై రాయగడ వైపు వస్తున్న సురేష్, సంతోష్‌లు అమలాభట్ట కూడలికి చేరేసరికి ఎదురుగా వస్తున్న బొలేరో అదుపుతప్పి ఢీకొట్ట్డంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైకు కున డుపుతున్న సంతోష్ స్వల్ప గాయాలతో బయటపడగా.. వెనుక కూర్చున్న సురేష్‌కు తీవ్రగాయాలైనట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
ప్రయాణికుల భద్రతపై ఆరా
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ 22823 న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుల సౌకర్యాలు, పరిశుభ్రత, సేవా నాణ్యత, భద్రతా చర్యలు తనిఖీ చేశారు. అనంతరం భద్రక్ రైల్వే స్టేషన్ సందర్శించి ప్లాట్ ఫారంపై సౌకర్యాలు, సిబ్బంది లాబీని పరిశీలించారు. యార్డు కార్యాచరణ సామర్థ్యంపై దృష్టి సారించారు.
నవీన్‌కు ప్రధాని పరామర్శ
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక న్యూ ఢిల్లీలో కలుద్దామని అన్నారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో నవీన్ పట్నాయక్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన